బాపట్ల జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్తో రైతు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
బాపట్ల జిల్లాలో విద్యుత్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేమూరు మండలం జంపని గ్రామంలో పొలంలో పనిచేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
Unidentified dead body


బాపట్ల జిల్లా, 15 నవంబర్ (హి.స.)

బాపట్ల జిల్లాలో విద్యుత్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేమూరు మండలం జంపని గ్రామంలో పొలంలో పనిచేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. జంపని గ్రామానికి చెందిన చినరాజు (42) పొలంలో పిచికారీ పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్ర విద్యుత్ ప్రభావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అదే సమయంలో అక్కడే ఉన్న సురేశ్ అనే వ్యక్తికి కూడా విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన సురేశ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చినరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పొలాల్లో విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande