
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
ప్రకాశం జిల్లాలో విషాదంలో ఉన్న గిరిబాబు కుటుంబాన్ని సినీనటుడు మోహన్బాబు పరామర్శించారు. గిరిబాబు పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోహన్బాబు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా గిరిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, ఈ విషాదాన్ని తట్టుకునే మనోబలాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.
గిరిబాబు పార్థివదేహానికి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు, సన్నిహితులు తరలివస్తున్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్