కాకినాడ జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. రూ.9 లక్షల సరుకు స్వాధీనం
కాకినాడ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం రవాణాను అడ్డుకున్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో మద్యం పట్టుబడింది.
Bengaluru Liquor Ban


కాకినాడ , 15 నవంబర్ (హి.స.)

కాకినాడ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం రవాణాను అడ్డుకున్నారు. తాళ్లరేవు మండలం పి.మల్లవరం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో మద్యం పట్టుబడింది. ఓ వ్యాన్లో అనుమానాస్పదంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.

ఈ తనిఖీల్లో మొత్తం 195 మద్యం కేసులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ మద్యాన్ని యానాం నుంచి తీసుకొస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ కోటేశ్వర్ వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచిన నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande