ఏపీలో పలు ప్రాంతాల్లో రామోజీ గ్రూపు ఉద్యోగుల బైక్ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాల్లో రామోజీ గ్రూపు ఉద్యోగులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి, కాకినాడ, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి.
RAMOJI


అమరావతి , 15 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాల్లో రామోజీ గ్రూపు ఉద్యోగులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి, కాకినాడ, గుంటూరు, కడప తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. రామోజీరావు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఉద్యోగులు ర్యాలీల ద్వారా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ తుడా కార్యాలయం కూడలి, శ్రీనివాసం, మామిడికాయల మండి, అన్నమయ్య కూడలి, ఎంఆర్ పల్లి కూడలి, బాలాజీ కాలనీ మీదుగా సాగింది. కాకినాడలో మార్గదర్శి కార్యాలయం నుంచి సర్పవరం జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. మెయిన్ రోడ్డు, జగన్నాథపురం, దేవాలయం వీధి మీదుగా ఉద్యోగులు ప్రయాణించారు.

అదేవిధంగా గుంటూరులో హిందూ కళాశాల సమీపంలోని మార్గదర్శి కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై కలెక్టరేట్, కంకరగుంట ఫ్లైఓవర్, పట్టాభిపురం, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్ మీదుగా కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో రామోజీ గ్రూపునకు చెందిన వివిధ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామోజీరావు జీవితకాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆయన ఆశయాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ ర్యాలీలతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande