నిజామాబాద్లో ఘనంగా రామోజీరావు జయంతి వేడుకలు
నిజామాబాద్లో ప్రముఖ మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మార్గదర్శి సంస్థ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
నిజామాబాద్లో ఘనంగా రామోజీరావు జయంతి వేడుకలు


నిజామాబాద్, 15 నవంబర్ (హి.స.)

నిజామాబాద్లో ప్రముఖ మీడియా దిగ్గజం రామోజీరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మార్గదర్శి సంస్థ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి, ఈనాడు సంస్థలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

రామోజీరావు అందించిన సేవలను స్మరించుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మీడియా రంగంలో చేసిన కృషి, పత్రికా ప్రపంచానికి పరిచయం చేసిన నూతన ఒరవడులను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఈనాడు పత్రిక స్థాపనతో తెలుగు జర్నలిజంలో ప్రత్యేక ముద్ర వేసిన రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్గదర్శి, ఈనాడు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామోజీరావు ఆశయాలు, విలువలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా సిబ్బంది పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande