
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
రైళ్లలో ప్రయాణికుల వస్తువులను అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ మీదుగా నడిచే నాందేడ్ ఎక్స్ప్రెస్లో చోరీలకు పాల్పడుతున్న సుకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.1.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
రైలు ప్రయాణాల సమయంలో ప్రయాణికుల బ్యాగులు, విలువైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలకు సంబంధించి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితుడిపై నిఘా పెట్టి సుకుమార్ను గుర్తించి అరెస్టు చేశారు.
అనంతరం అతడి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.65 లక్షలుగా అంచనా వేశారు. రైళ్లలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తమ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని పోలీసులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్