ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుంటుపల్లిలోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది.
Unidentified dead body


ఎన్టీఆర్ జిల్లా, 15 నవంబర్ (హి.స.)

ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుంటుపల్లిలోని ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. కళాశాలలోని తరగతి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాదం నెలకొంది.

మృతిచెందిన విద్యార్థిని జగ్గయ్యపేటకు చెందిన జావేద్గా గుర్తించారు. రెండు రోజుల క్రితమే ఆమె ఇంటి నుంచి కళాశాలకు వచ్చినట్లు సమాచారం. అయితే ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యార్థి తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం వెనుక ఏవైనా వ్యక్తిగత లేదా ఇతర సమస్యలు ఉన్నాయా అనే కోణంలో వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande