
అమరావతి , 15 నవంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి దర్శనానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠా శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు టీటీడీ అధికారులు సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం తీర్థప్రసాదాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు నారా రోహిత్ తిరుమల పర్యటనతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్