
అమరావతి , 16 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర తుఫాన్గా మారనుంది. తుఫాన్గా రూపాంతరం చెందిన తర్వాత దీనికి ‘అక్వాన్’గా నామకరణం చేయనున్నారు. రేపటికి ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 19వ తేదీ నాటికి అతి తీవ్ర తుఫాన్గా బలపడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశముందని తెలిపారు.
తుఫాన్ తీవ్రత, దాని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్