బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు లో చుక్కెదురు.
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది.
Kaushik Reddy


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది. వాయిస్ శాంపిల్ ఇవ్వాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కలుగజేసుకోవడానికి న్యాయస్థానం ససేమిరా అంది. దీంతో దర్యాప్తులో భాగంగా ఆయన గొంతు నమూనాను తీసుకునేందుకు పోలీసులకు అడ్డంకులు తొలగిపోయాయి.

2026 జనవరిలో సమ్మక్క - సారలమ్మ జాతర జరిగినప్పుడు వివాదం మొదలైంది. అప్పుడు పోలీసులు తమ పని చేసుకుంటుంటే అడ్డుపడ్డారని, అంతేకాకుండా కరీంనగర్ సీపీ గౌష్ ఆలం గురించి అనుచితంగా మాట్లాడారని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై హుజూరాబాద్, వీణవంక స్టేషన్లలో కేసులు పెట్టారు. తర్వాత ఈ వ్యవహారాన్ని విచారించే బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande