
అన్నమయ్య జిల్లా , 16 నవంబర్ (హి.స.)అన్నమయ్య జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామాపురం మండలం సుద్దమల్ల పంచాయతీలో టీడీపీ కార్యకర్తల వాహనంపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడారు. ఈ ఘటనలో కారును ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు .
స్థానికంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీడీపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు చికిత్స అందిస్తున్నారు.పంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విభేదాల నేపథ్యంలో దాడి జరిగిందా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు స్పందించి ఘటనపై విచారణ చేపడితే దాడికి గల కారణాలు, బాధ్యుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్