
హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 6:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు.
సోనియాగాంధీ రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవ, దేశ రాజకీయాల్లో ఆమె పోషించిన పాత్రను వివరించే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం అనంతరం ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్