SIR డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని ఓటర్లకు ఈసీ ఊరట
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో పేరు కనిపించని ఓటర్లకు ఎన్నికల సంఘం ఊరట కల్పించింది.
State election commission


అమరావతి , 16 నవంబర్ (హి.స.)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో పేరు కనిపించని ఓటర్లకు ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఓటరు జాబితాలో తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విధంగా దరఖాస్తు చేసినంత మాత్రాన సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది.

SIR ప్రక్రియలో పలు కారణాలతో కొంతమంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయే అవకాశం ఉంది. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారం ఫామ్-6 సమర్పించి ఓటరుగా తిరిగి నమోదు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ ఉద్దేశమని పేర్కొంది.

అయితే ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే వ్యక్తికి ఇప్పటికే మరో నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో పేరు ఉండకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలనే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈసీ తాజా స్పష్టతతో డ్రాఫ్ట్ జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు ఉపశమనం లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande