
ఆదిలాబాద్, 16 నవంబర్ (హి.స.)
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు ఇళ్లలో అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని మండల కేంద్రమైన ముథోల్‌లోని కూలీ గల్లీలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
కందోల్ల గంగవ్వ, కందోల్ల అనిత, జింకొల్ల పండరీకి చెందిన ఇళ్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇళ్లలోని వస్తువులన్నీ మంటలకు ఆహుతి కావడంతో బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
ప్రమాదంలో గంగవ్వ ఇంట్లో దాచుకున్న సుమారు రూ.50 వేల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అదేవిధంగా జింకొల్ల ఎర్రన్నకు చెందిన మందు సంచులు, 10 శనగల బస్తాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అనిత, పండరీ ఇళ్ల పైకప్పు భాగాలు, ఇతర వస్తువులు సైతం కాలిపోయాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు