గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026కు దరఖాస్తుల ఆహ్వానం
గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026 ప్రదానానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ అవార్డులకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ లోక్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు.
గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026కు దరఖాస్తుల ఆహ్వానం


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2026 ప్రదానానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ అవార్డులకు అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ లోక్భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం.

సమాజ అభివృద్ధికి సేవలందిస్తున్నవారికి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నవారికి ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభించనుంది. తమ తమ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అవార్డులకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు తదితర వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్నవారు నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ, సేవల ప్రాధాన్యతకు తగిన గుర్తింపు ఇవ్వనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande