నేటితో ముగియనున్న అక్రమ అండాల సేకరణ కేసు నిందితుల కస్టడీ
అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో కీలక వివరాలను రాబట్టేందుకు పోలీసులు ఐదు రోజుల పాటు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు.
TELANGANA police


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)

అక్రమ అండాల సేకరణ వ్యవహారంలో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల పోలీసు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో కీలక వివరాలను రాబట్టేందుకు పోలీసులు ఐదు రోజుల పాటు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఎనిమిది మంది నిందితులను పోలీసులు సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు. నగరంలోని ఐదు ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమంగా అండాల సేకరణ జరుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సంబంధిత కేంద్రాలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మియాపూర్, మహంకాళి, మలక్పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా? అక్రమ కార్యకలాపాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీ విచారణలో వెలుగుచూసిన అంశాలను పరిశీలించి, వాటి ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande