రామోజీరావుకు మంత్రుల ఘన నివాళులు
మీడియా రంగంలో విశేష సేవలందించి, తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావుకు మంత్రులు జనార్దన్రెడ్డి, డీఎస్బీవీ స్వామి ఘనంగా నివాళులర్పించారు.
RAMOJI


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)

మీడియా రంగంలో విశేష సేవలందించి, తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావుకు మంత్రులు జనార్దన్రెడ్డి, డీఎస్బీవీ స్వామి ఘనంగా నివాళులర్పించారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజానికి, మీడియా రంగానికి ఆయన అందించిన కృషిని కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రి డీఎస్బీవీ స్వామి మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన కృషి, పట్టుదలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎదిగారని పేర్కొన్నారు. ఎన్నో సంస్థలను స్థాపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. ఎన్ని విజయాలు సాధించినా విలువల విషయంలో ఎక్కడా రాజీపడని వ్యక్తిత్వం ఆయన సొంతమని కొనియాడారు. ఆయన జీవన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు.

మంత్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో విలువలకు ప్రాధాన్యతనిస్తూ రామోజీరావు కొత్త ఒరవడిని సృష్టించారని చెప్పారు. తన దార్శనికత, అంకితభావం, కార్యదీక్షతో మీడియాతో పాటు అనేక రంగాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, రామోజీరావు జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని మంత్రి జనార్దన్రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande