నేటి నుంచి ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు
ప్రారంభం దేశవ్యాప్తంగా పోలీసు బలగాల ప్రతిభను చాటిచెప్పే ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
TELANGANA police


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)ప్రారంభం

దేశవ్యాప్తంగా పోలీసు బలగాల ప్రతిభను చాటిచెప్పే ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్లోని హకీంపేట సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ ఈ పోటీలకు వేదికగా నిలవనుంది. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘హార్మొనీ ఇన్ సర్వీస్’ అనే నినాదంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

ఈ పోటీల ప్రారంభోత్సవానికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పోలీసు బలగాలకు చెందిన బ్యాండ్ బృందాలు ఇందులో పాల్గొని తమ సంగీత ప్రతిభను ప్రదర్శించనున్నాయి. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలను ఎంపిక చేయనున్నారు.

పోలీసు సిబ్బందిలో క్రమశిక్షణ, సమన్వయం, ఐక్యతను పెంపొందించడంతో పాటు సంగీతంపై ఆసక్తిని ప్రోత్సహించడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. ఈ నెల 20న జరగనున్న ముగింపు వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరుకానున్నారు. జాతీయ స్థాయి పోలీస్ బ్యాండ్ పోటీలు హకీంపేటలో నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande