బంగాళాఖాతంలో తుపాను.. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారనుంది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Rain


హైదరాబాద్ , 16 నవంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారనుంది. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నెల 19న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అదే రోజు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా. తుపాను ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

19, 20, 21 తేదీల్లో వర్షాల ప్రభావం కొనసాగవచ్చని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. తుపాను కదలికలు, దాని తీవ్రతను బట్టి వర్షాల విస్తీర్ణం, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, ముఖ్యంగా పంటలు కోతకు సిద్ధంగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తుపాను ప్రభావంపై అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande