తిరుమల శ్రీవారికి వైభవంగా పుష్పయాగం
తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నేడు పుష్పయాగం నిర్వహించనున్నారు.
Ttd


తిరుమల , 16 నవంబర్ (హి.స.)తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నేడు పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్తిక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ విశేష పూజా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. ఇందుకోసం తిరుమల ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పుష్పయాగం నిర్వహణ కోసం భారీ స్థాయిలో పూలను తిరుమలకు తరలించారు. టీటీడీ ఉద్యానవన శాఖ కార్యాలయం నుంచి శ్రీవారి సేవకులు వివిధ రకాల పుష్పాలను ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9 టన్నుల పుష్పాలను వినియోగించనున్నట్లు ఈవో తెలిపారు. వివిధ రకాల రంగురంగుల పూలతో స్వామివారికి విశేషంగా పుష్పార్చన చేయనున్నారు.

ఆలయ సంప్రదాయాల ప్రకారం నిర్వహించే ఈ పుష్పయాగానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో సేవ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన విశేషం. పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande