తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి కొత్త బాస్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్త బాస్ వచ్చారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా పదవి చేపట్టారు.
RTC


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కొత్త బాస్ వచ్చారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా పదవి చేపట్టారు.

నవంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద ఎత్తున అధికారుల మార్పుల్లో భాగంగా ఆయనను ఆక్టోపస్ విభాగం నుంచి ఆర్టీసీకి పంపించారు. దీంతో సంస్థ పగ్గాలు ఆయన చేతికి వచ్చాయి.

ఇంతకు ముందు ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డికి ఇప్పుడు వేరే బాధ్యతలు ఇచ్చారు. ఆయనను పౌర సరఫరాల శాఖ కమిషనర్గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. అంతేకాదు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా, అలాగే లీగల్ మెట్రాలజీ కంట్రోలర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ మార్పులతో రాష్ట్రంలోని కీలక పరిపాలన విభాగాల్లో కొత్త అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande