పేదలకు సొంతిల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. ప్రభుత్వ విప్
పేదలకు సొంతిల్లు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు.
MLA


మహబూబాబాద్, 16 నవంబర్ (హి.స.)

పేదలకు సొంతిల్లు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు.

తొర్రూరు పట్టణం బయట నుంచి గోపాలగిరి గ్రామం వైపు వెళ్లే దారిలో కట్టిన 280 డబుల్ బెడ్ రూం ఇళ్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కూడా పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసిన తర్వాత అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు డోలు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలతో ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు. చాలా ఏళ్లుగా ఎదురుచూసిన సొంతింటి కల నిజం కావడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. తమకు ఇళ్లు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి వారు కృతజ్ఞతలు చెప్పారు.

పేద కుటుంబాల కోసం స్థలం ఇవ్వడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. ఇళ్లు పొందిన వారు తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అందరూ కలిసి సొసైటీగా ఏర్పడి సమస్యలు వస్తే కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande