
యాదాద్రి భువనగిరి , 16 నవంబర్ (హి.స.)యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 24న అన్నకూటోత్సవం నిర్వహించనున్నారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఈ ప్రత్యేక ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
ఉత్సవంలో భాగంగా అదే రోజు మధ్యాహ్నం 11.45 గంటల నుంచి 1.30 గంటల వరకు ఆలయంలో గోష్ఠి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు, అర్చకులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు యాదగిరిగుట్టకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నకూటోత్సవం, ఆకాశ దీపారాధన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు సూచిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్