నేడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నేడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Union Home Minister Amit Shah 1


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, దివంగత రామోజీరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల’ (Ramoji Excellence Awards) ప్రదానోత్సవ కార్యక్రమం నేడు (సోమవారం) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

వివిధ రంగాలలో విశేష కృషి చేసి, సమాజ అభ్యున్నతికి తోడ్పడిన ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. సామాజిక సేవ, పాత్రికేయం, కళలు, సాహిత్యం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన విజేతలకు అమిత్ షా చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande