నేడు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి.
Stock market


న్యూఢిల్లీ, 16 నవంబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలిచాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లలో కొనుగోళ్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 25,291 స్థాయికి చేరింది.

ప్రధాన సూచీలు లాభాల్లో ముగిసినప్పటికీ విస్తృత మార్కెట్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 0.51 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 1.10 శాతం నష్టపోయాయి. మరోవైపు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 0.40 శాతం పెరిగి 94 స్థాయి కంటే బలంగా కదిలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande