అంతర్రాష్ట్ర అక్రమ ఈ-సిగరెట్ల దందాపై తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ ఉక్కుపాదం
అంతర్రాష్ట్ర అక్రమ ఈ-సిగరెట్ల దందాపై తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ ఉక్కుపాదం
అంతర్రాష్ట్ర అక్రమ ఈ-సిగరెట్ల దందాపై తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ ఉక్కుపాదం


హైదరాబాద్, 16 నవంబర్ (హి.స.)

తెలంగాణలో మాదకద్రవ్యాలు, నిషేధిత మత్తుపదార్థాల కట్టడి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ‘ఈగల్’ (EAGLE - Elite Action Group for Drug Law Enforcement) అంతర్రాష్ట్ర అక్రమ ఈ-సిగరెట్ల రవాణా ముఠా గుట్టురట్టు చేసింది. దేశంలో నిషేధం ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఈ-సిగరెట్లను (వేప్స్) తరలించి విక్రయిస్తున్న ముఠాపై ఈగల్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది.

విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు, నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో వివిధ ఫ్లేవర్లకు చెందిన ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఈ-సిగరెట్లను కొరియర్ మరియు ఇతర రవాణా మార్గాల ద్వారా నగరానికి తెప్పించి, ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈ అక్రమ సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిషేధిత ఈ-సిగరెట్లు, మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈగల్ ఫోర్స్ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande