
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పుల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి.
గురువారం ఉదయం మార్కెట్ మొదలవగానే పసిడి, వెండి ధరలు మరోసారి పడిపోవడంతో పెళ్లిళ్ల సీజన్లో నగలు కొనాలనుకుంటున్న సామాన్యులకు పెద్ద ఊరట దక్కింది.
గత రెండు రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ. 2,350 నుంచి రూ. 3,000 వరకు దిగిరాగా బంగారం బాటలోనే వెండి కూడా భారీగా తగ్గి ఒక్కరోజే కిలోకు రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు తగ్గింది.
ఈ తాజా తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్, గుంటూరు, తిరుపతి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,33,250 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో రూ. 1,22,140గా, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు, తిరుపతి నగరాల్లో రూ. 1,22,140 నుంచి రూ. 1,22,150 మధ్య ఉంది, ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్, తిరుపతి, గుంటూరు మార్కెట్లలో కిలో వెండి రూ. 1,80,000 నుంచి రూ. 1,85,000 మధ్య కొనసాగుతుండగా విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో కిలో వెండి రూ. 1,80,000 వద్ద నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..