రాప్తాడు బాలికపై దాడి కేసు: నిందితుడు హేమంత్పై పోలీసుల ఎదురుకాల్పులు!
రాప్తాడు బాలికపై దాడి కేసు: నిందితుడు హేమంత్పై పోలీసుల ఎదురుకాల్పులు!
రాప్తాడు బాలికపై దాడి కేసు: నిందితుడు హేమంత్పై పోలీసుల ఎదురుకాల్పులు!


అనంతపురం, 02 నవంబర్ (హి.స.)

:

రాప్తాడులో చిన్నారిపై దాడికి పాల్పడ్డ దారుణ ఘటనలోని ప్రధాన నిందితుడు హేమంత్‌ను పట్టుకునే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో దాక్కున్న నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.

పోలీసులపై కత్తితో దాడికి యత్నం:

విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు హేమంత్ ఆత్మకూరు అడవుల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని చుట్టుముట్టి లొంగిపోవాలని కోరగా, అతను రాప్తాడు సీఐ (CI) పై కత్తితో హఠాత్తుగా దాడికి యత్నించాడు.

ఆత్మరక్షణలో 6 రౌండ్ల కాల్పులు:

నిందితుడు సీఐ పై దాడికి తెగబడటంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా హేమంత్‌పై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande