
హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు (నవంబర్ 2) హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రతో పాటు పలు కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
అమిత్ షా పర్యటన పూర్తి షెడ్యూల్:
-
మధ్యాహ్నం 1:10 గంటలకు: ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
-
మధ్యాహ్నం 1:30 గంటలకు: చార్మినార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
-
మధ్యాహ్నం 2:15 గంటలకు: ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుని భోజనం చేస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారు.
-
సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు: బషీర్‌బాగ్ నుంచి మోజంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు సాగే ‘మహా పాదయాత్ర’లో పాల్గొంటారు.
-
సాయంత్రం 5:15 గంటలకు: ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
అమిత్ షా రాక మరియు పాదయాత్ర నేపథ్యంలో పాతబస్తీ, బషీర్‌బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే నగరంలో సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi