బంగాళాఖాతంలో మరో తీవ్ర తుఫాన్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన మురుసు తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారింది.
Cyclone-Likely-to-Form-in-Bay-of-Bengal-by-October-25


అమరావతి , 02 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన మురుసు తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున నెల్లూరు నుంచి నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఉదయం నుంచి పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో జనజీవనం ప్రభావితమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తుఫాన్ ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. వరి సహా పలు పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో పంటలు తడిసిపోయి దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని భయపడుతున్నారు. ఇప్పటికే అర్నాబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు మరో తుఫాన్ రూపంలో కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande