
అమరావతి , 02 నవంబర్ (హి.స.)
మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ సమస్యలు, విద్యుత్ తీగలు తెగిపడటం, స్తంభాలు దెబ్బతినడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు సంబంధిత అధికారులకు సమాచారం అందించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ప్రజలు 6281709355 నంబర్కు, ఎన్టీఆర్ జిల్లా వారు 9440817561కు, గుంటూరు జిల్లా ప్రజలు 9440817526కు సంప్రదించవచ్చు. బాపట్ల జిల్లాకు 9281413774, ప్రకాశం జిల్లాకు 9440817491, పల్నాడు జిల్లాకు 7661019447 నంబర్లను కేటాయించారు.
తుపాను సమయంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు తలెత్తితే ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యుత్ శాఖ సూచిస్తోంది. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, దెబ్బతిన్న స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్