
హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు మేడ్చల్ పోక్సో కోర్టు సమన్లు పంపింది. జనవరి 28న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
17 ఏళ్ల బాలికను వేధించడం, మద్యం తాగించి శారీరకంగా ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు అతడిపై ఉన్నాయి. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మే 2026లో పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ కేసులో ఆధారాలు మాయం చేశారనే ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు అదనపు సెక్షన్లు జోడించారు. ఆ తర్వాత మే 16, 2026న భగీరథ్ను రిమాండ్కు పంపారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉండగా, కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు