మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి
నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్దిమడుగులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు.
CM Revanth Reddy


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

నాగర్కర్నూల్ జిల్లా పదర మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్దిమడుగులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపారు.

అనంతరం మద్దిమడుగు ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులపై సీఎం దృష్టి సారించనున్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టనున్న కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. అలాగే సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన మద్దిమడుగు ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సంత్ సేవాలాల్ విగ్రహ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించడంతో పాటు భక్తులు, సందర్శకుల రాక పెరిగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande