ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను బలోపేతం చేసే లక్ష్యంతో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సు గురువారం హైదరాబాద్లో మొదలైంది.
Traffic


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను బలోపేతం చేసే లక్ష్యంతో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సు గురువారం హైదరాబాద్లో మొదలైంది.

రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్తో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రైవేట్ వాహనాల వినియోగం, వాయు కాలుష్యాన్ని తగ్గించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. బస్సులు, మెట్రో సేవల అనుసంధానం, కార్పూలింగ్, పాదచారులకు అనుకూలమైన రహదారులు, చివరి మైలు కనెక్టివిటీ వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారు.

ప్రభుత్వ అధికారులు, రవాణా రంగ నిపుణులు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, పౌర సంఘాలకు ఈ వేదికలో భాగస్వామ్యం కల్పించారు. ఈ నెల 28 వరకు ఇది కొనసాగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande