రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది.. ఎంపీ అరవింద్
డీలిమిటేషన్ విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందని, దానికి సంబంధించిన ముసాయిదా బిల్లు త్వరలోనే బయటకు వస్తుందని చెప్పారు.
MP


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

డీలిమిటేషన్ విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరుగుతుందని, దానికి సంబంధించిన ముసాయిదా బిల్లు త్వరలోనే బయటకు వస్తుందని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులు, రాబోయే ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ను కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్న ధీమా, 'కోటి ఓట్లు - 90 సీట్లు' అనే కాంగ్రెస్ నినాదం వినడానికి బాగున్నాయని అర్వింద్ ఎద్దేవా చేశారు. కానీ అవన్నీ కేవలం ఊహలు మాత్రమేనని, కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ నాయకులకు నిజ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు..

గత బీఆర్ఎస్ సర్కార్ ను కూడా అర్వింద్ వదిలిపెట్టలేదు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి నీళ్లు తరలిపోవడానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande