నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు విడుదల
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా అధికారులు తాగునీటిని విడుదల చేశారు. త్రిపురారం మండల ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
cauvery-water-dispute-cwma-crucial-meeting-in-delhi-karnataka-water-crisis


హైదరాబాద్ , 26 నవంబర్ (హి.స.)

నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా అధికారులు తాగునీటిని విడుదల చేశారు. త్రిపురారం మండల ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. విడుదల చేసిన నీటిని పెద్దదేవులపల్లి, పాలేరు రిజర్వాయర్లకు మళ్లించి వాటిని పూర్తిస్థాయిలో నింపాలని అధికారులు సూచించారు.

రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచడంతో పాటు మండల పరిధిలోని చెరువులు, కుంటలను కూడా నింపేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. కాలువకు నీరు విడుదల కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు కొంత ఊరట లభించనుంది.

రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలను పెంచడం ద్వారా స్థానిక అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటి వినియోగంలో వృథాను నివారిస్తూ, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande