ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి
Collector


పెద్దపల్లి, 26 నవంబర్ (హి.స.)

77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హాజరై, ఓటరు జాబితా పరిశీలకురాలు బాలమయి దేవితో కలిసి అందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం మాట్లాడిన కలెక్టర్, రాజ్యాంగంలోని ఆశయాలను, స్ఫూర్తిని నిత్య జీవితంలో అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని ప్రశంసించారు. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించిందని గుర్తుచేశారు.

1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని, 2015 నుంచి ప్రతి ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande