పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం శుభవార్త అందించింది. పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Exam


అమరావతి , 26 నవంబర్ (హి.స.)

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం శుభవార్త అందించింది. పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఫీజు చెల్లించేందుకు అదనపు సమయం కల్పించినట్లు తెలిపారు.

తాజా నిర్ణయం ప్రకారం విద్యార్థులు డిసెంబరు 5వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్షల ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత కూడా ఫీజు చెల్లించేందుకు విడతలవారీగా అవకాశం కల్పించారు. డిసెంబరు 6 నుంచి 9వ తేదీ వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు స్వీకరించనున్నారు. డిసెంబరు 10 నుంచి 13వ తేదీ వరకు రూ.200 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇక డిసెంబరు 14 నుంచి 18వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande