హైదరాబాద్లో కాంగ్రెస్ సంవిధాన్ రక్షా మార్చ్
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సంవిధాన్ రక్షా మార్చ్ ఘనంగా జరిగింది.
Rally


హైదరాబాద్, 26 నవంబర్ (హి.స.)

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సంవిధాన్ రక్షా మార్చ్ ఘనంగా జరిగింది. ట్యాంక్బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలైన ర్యాలీ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు సాగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande