
వికారాబాద్, 26 నవంబర్ (హి.స.)
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గొట్టిముక్కల, ఐనాపూర్ గ్రామాల్లో పర్యటన చేశారు. ముందుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసి, అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు.
వీబీజీ రామ్ జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్, పనులు నాణ్యతతో జరుగుతున్నాయా, కూలీల హాజరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఎలా అమలవుతుందో సమీక్షించారు. ఎంతమంది లబ్ధిదారులు నమోదయ్యారు, క్లెయిమ్లు ఏ స్థితిలో ఉన్నాయని అధికారులను ప్రశ్నించారు.
గొట్టిముక్కల జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్లిన ఆయన విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలలో మౌలిక సౌకర్యాలపై ఎంఈవో నుంచి వివరాలు తీసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు