
అమరావతి , 27 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, మంత్రులు వర్చువల్గా సమావేశంలో పాల్గొంటున్నారు.
ఈసారి కేబినెట్ ముందుకు దాదాపు 30 ప్రతిపాదిత అజెండా అంశాలను తీసుకొచ్చినట్లు సమాచారం. ఆయా ప్రతిపాదనలపై మంత్రివర్గం సమీక్షించి నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనాపరమైన అంశాలు, వివిధ శాఖల ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 30 అజెండా అంశాలపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్