షానవాజ్ హుస్సేన్ నివాసానికి మోహన్ భగవత్.. నూతన వధూవరులకు ఆశీస్సులు
షానవాజ్ హుస్సేన్ నివాసానికి మోహన్ భగవత్.. నూతన వధూవరులకు ఆశీస్సులు
ડૉ. મોહન ભાગવત, રાષ્ટ્રીય પ્રવક્તા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસેૈનના દિલ્હી સ્થિત નિવાસ્થાને પહોંચ્યા


న్యూఢిల్లీ, నవంబర్ 27 (హి.స): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ నివాసానికి వెళ్లారు. అక్కడ షానవాజ్ హుస్సేన్ కుమారుడు అర్బాజ్ హుస్సేన్, కోడలు అఫ్షాన్‌లను ఆశీర్వదించారు.

ఈ భేటీకి సంబంధించిన నాలుగు ఫొటోలను 'ఎక్స్' (ట్విటర్) వేదికగా షానవాజ్ హుస్సేన్ పంచుకున్నారు. ఈ రోజు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్‌చాలక్ గౌరవనీయులైన మోహన్ భగవత్ జీ ఢిల్లీలోని మా నివాసానికి వచ్చి కుమారుడు అర్బాజ్, కోడలు అఫ్షాన్‌లను ఆశీర్వదించారు అని పేర్కొన్నారు. డాక్టర్ భగవత్ చూపిన ఆప్యాయత, ఆశీర్వాదాలు తమ కుటుంబానికి ఎంతో అమూల్యమైనవని, తమ కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని షానవాజ్ హుస్సేన్ తెలిపారు.

ఆయన షేర్ చేసిన ఫొటోలలో మోహన్ భగవత్ కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. నూతన వధూవరులకు పువ్వులు, బహుమతులు అందించి ఆశీర్వదించారు. కాగా, షానవాజ్ హుస్సేన్ కుమారుడు అర్బాజ్‌కు అఫ్షాన్ అక్రమ్ ఖాన్‌తో గత అక్టోబర్‌లో వివాహం జరిగింది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande