ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎస్కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో ప్రొటోకాల్ ఉల్లంఘనల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజును కలవనున్నారు.
BRS


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

తెలంగాణలో ప్రొటోకాల్ ఉల్లంఘనల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజును కలవనున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, సుధీర్రెడ్డి తదితరులు సీఎస్ను కలిసి ప్రొటోకాల్ నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు.

ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొటోకాల్ నిబంధనలను పాటించకుండా తమను అవమానించేలా వ్యవహరిస్తున్నారనే అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత ఘటనల వివరాలను ఆయనకు వివరించి, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande