శంషాబాద్ ఎయిర్పోర్టులో నకిలీ టికెట్ కలకలం
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వ్యవహారం కలకలం రేపింది.
Chennai airport


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వ్యవహారం కలకలం రేపింది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు నకిలీ టికెట్ను గుర్తించారు. ప్రయాణానికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్న సమయంలో టికెట్పై అనుమానం రావడంతో అధికారులు తనిఖీ చేపట్టారు.

ఈ క్రమంలో సదరు ప్రయాణికుడు చూపించిన టికెట్ నకిలీదిగా గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు ఆ టికెట్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని టికెట్ ఎక్కడి నుంచి పొందాడు? ఎవరు జారీ చేశారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ టికెట్ తయారీకి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందా అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande