ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి మూడో అంతస్తు వరకు వ్యాపించడంతో అక్కడ కలకలం రేగింది.
Fire balakot


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి మూడో అంతస్తు వరకు వ్యాపించడంతో అక్కడ కలకలం రేగింది. మంటలను గమనించిన సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? కార్యాలయంలోని ఫర్నిచర్, కీలక రికార్డులకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande