తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి హవా.. 2,540 స్థానాల్లో విజయం
ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు ఆధిక్యం సాధించారు.
Vote


అమరావతి , 27 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. ఈ ఎన్నికల్లో కూటమి మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు మొత్తం 2,540 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు వైఎస్సార్సీపీ మద్దతుదారులు 1,111 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఫలితాలను పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులకు ఓటర్లు ఎక్కువగా మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది.

ఎన్నికల ఫలితాలతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, వైసీపీ శిబిరంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కొంత నిరాశ కనిపిస్తోంది. గ్రామస్థాయిలో తమకు ప్రజాదరణ పెరిగిందని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుకు ఈ విజయాలు నిదర్శనమని కూటమి నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాబోయే విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఈ ఫలితాలు కీలక చర్చకు దారితీశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande