21 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఇంటికి చేరిన ఏడుగురు మత్స్యకారులు
కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు 21 రోజుల తర్వాత సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
21 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా ఇంటికి చేరిన ఏడుగురు మత్స్యకారులు


అమరావతి , 27 నవంబర్ (హి.స.)

కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు 21 రోజుల తర్వాత సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇన్నాళ్లూ వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడంతో గ్రామంలో సంతోషకర వాతావరణం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4వ తేదీన ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అయితే వేటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. రోజుల తరబడి వారి ఆచూకీ తెలియకపోవడంతో ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. తమవారు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబసభ్యులు ఎదురుచూశారు.

ఎట్టకేలకు 21 రోజుల అనంతరం ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉప్పాడకు చేరుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తమ కుటుంబసభ్యులు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. గ్రామస్తులు కూడా వారికి ఘన స్వాగతం పలికారు. ఇన్ని రోజులుగా కొనసాగిన ఆందోళనకు తెరపడటంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande