చేపల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని చేపల మార్కెట్లపై ఆహార భద్రతా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో పలు మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
చేపల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు


హైదరాబాద్ , 27 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలోని చేపల మార్కెట్లపై ఆహార భద్రతా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో పలు మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బేగంబజార్, రామ్నగర్ చేపల మార్కెట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.

మార్కెట్లలో విక్రయిస్తున్న చేపల నాణ్యత, తాజాదనం, నిల్వ చేసే విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చేపలను తాజాగా ఉంచేందుకు ఉపయోగిస్తున్న ఐస్ నాణ్యతపై ఆరా తీశారు. అలాగే మార్కెట్ పరిసరాల్లో పరిశుభ్రత, చేపలను నిల్వ చేసే ప్రాంతాల పరిస్థితులను తనిఖీ చేశారు. వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను పరిశీలించారు.

అపరిశుభ్రమైన వాతావరణంలో చేపలను విక్రయిస్తున్న వారిపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా చేపల విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నగరంలోని ఇతర చేపల మార్కెట్లలోనూ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande