ఎన్టీఆర్ జిల్లాలో ఏడో రోజుకు చేరిన పెద్దపులి ఆపరేషన్.. మళ్లీ అందిన ట్రాకర్ సిగ్నల్స్
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. గత మూడు రోజులుగా పులికి అమర్చిన ట్రాకర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
TIGER DEATH IN UP


ఎన్టీఆర్ జిల్లా, 27 నవంబర్ (హి.స.)

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చేపట్టిన ఆపరేషన్ ఏడో రోజుకు చేరుకుంది. గత మూడు రోజులుగా పులికి అమర్చిన ట్రాకర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. పులి ఎక్కడ సంచరిస్తోందన్న విషయంపై ఉత్కంఠ కొనసాగింది. అయితే తాజాగా ట్రాకర్ ద్వారా మళ్లీ సిగ్నల్స్ అందడంతో అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అర్ధరాత్రి సమయంలో కనుమూరు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి సంచరించినట్లు ట్రాకర్ సంకేతాల ఆధారంగా గుర్తించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పుణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నాయి. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని తిరువూరు ఆర్డీవో కుమార్ సూచించారు. అటవీ ప్రాంతాలు, పొలాల వైపు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు. పెద్దపులిని త్వరగా పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande