డిలిమిటేషన్ బిల్లుపై చర్చకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
డిలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
డిలిమిటేషన్ బిల్లుపై చర్చకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు


ఢిల్లీ , 27 నవంబర్ (హి.స.)

డిలిమిటేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభ సమావేశాల తేదీలను ప్రకటించారు. ఈ నెల 30వ తేదీన లోక్సభ సమావేశం జరగనుండగా, డిసెంబర్ 2వ తేదీన రాజ్యసభ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రెండు సమావేశాలు ఒక్కో రోజు పాటు కొనసాగనున్నాయి.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల ప్రకటన వెలువడింది. డిలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన అంశాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై పార్లమెంట్ వేదికగా చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ, రాజ్యసభల్లో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశాల్లో డిలిమిటేషన్ బిల్లుపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సమావేశాల పూర్తి ఎజెండాపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande